పోలవరం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వంపై సీరియస్

Polavaram Project View
Polavaram Project View

New Delhi: పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వంపై సీరియస్ అయింది. పోలవరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ, పీపీఏ నివేదికల వ్యత్యాసాలపై స్పందించాలని కేంద్ర జలశక్తిశాఖ, పీఎంఓ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశాయి. ఆ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడంతో జలశక్తిశాఖ సీరియస్ గా తీసుకుంది. పీఎంఓ రాసిన లేఖపై రెండు రోజులలోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వానికి మరోసారి లేఖ రాశారు.