చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్‌

chandra babu naidu
chandra babu naidu

విజయవాడ: ఏపి మాజీ సియం చంద్రబాబునాయుడుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ నిధులు వినియోగించారని బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి పిటిషన్‌ వేశారు. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాల పేరుతో ఓటర్లను ప్రభావితం చేశారని పిటిషనర్‌ పేర్కొన్నారు. చంద్రబాబు సొంత ఖర్చుల కింద నిధులను వసూలు చేయాలని కోరారు. అనిల్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్‌పై ఈ నెల 18న విచారణ జరగనుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/