వైఎస్సార్ చేయూత ప‌థ‌కంతో పేదరికానికి చెక్

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: సీఎం జగన్ వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మాట్లడుతూ.. వైఎస్సార్ చేయూత ప‌థ‌కంతో పేదరికానికి శాశ్వతంగా చెక్ ప‌డ‌నున్న‌ట్లు అన్నారు. మ‌హిళ‌ల‌కు ఆర్థిక స్వావ‌లంబ‌న క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా వైయస్ఆర్ చేయూత ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చిన‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం పేర్కొంది. 45 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌ల‌కు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సాయం అంద‌నుంది. ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల‌లో రూ. 75 వేల సాయం అంద‌నుంది. వీటికి అద‌నంగా బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థ‌ల నుంచి, మెప్మా, సెర్ప్ ప‌థ‌కాల నుంచి ఆర్థిక సాయం అందేలా ప్ర‌భుత్వం చూడ‌నుంది. ఈ ప‌థ‌కంపై విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. మొత్తం నాలుగేళ్లపాటు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకే డబ్బు జ‌మ‌కానున్న‌ట్లు తెలిపారు. జీవనోపాధి కోసం చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకోవడానికి చేయూతగా ఉండ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/