ఏపీ లో మే నెల పెన్షన్ పంపిణీ ప్రారంభం

మూడు గంటలలో 38.53 లక్షల మందికి పెన్షన్ అందచేసిన వాలంటీర్లు

pension money
pension money distibution

అమరావతి; ఆంద్రప్రదేశ్ లో మే నెలకు సంబందించిన వైయస్ఆర్ సిపి పెన్షన్ కానుకను ఈ ఉదయం నుంచి వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే పంపిణీ ప్రారంభించి మూడు గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 38.53 లక్షల మందికి పెన్షన్ అందచేసినట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యములో బయో మెట్రిక్ స్థానంలో ఫోటోల జియోట్యాగింగ్ విధానం లో పెన్షన్ లు అందిస్తున్నారు. పెన్షన్లు ఇవ్వడానికి ఇళ్లకు వెళ్లే వాలంటీర్లు, వృద్ధుల ఆరోగ్యాల గురించి ఆరా తీసి, కరోనా నేపథ్యములో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ పెన్షన్లు అందచేస్తున్నారని అధికారులు తెలిపారు. కాగా ఏపీ ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం 1,421.20 కోట్లను విడుదల చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/telangana/