రెండు చోట్ల నుండి పోటి చేయనున్న పవన్‌!

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారన్న విషయంపై జనసేనాని ఓ క్లారిటీ ఇచ్చారు ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీ చేస్తే ఆలోచనలో పవన్‌ ఉన్నారు. పార్టీ కార్యవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని పవన్‌ ట్విట్‌ చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు పవన్‌ పోటీ చేసే రెండు స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రెండు చోట్ల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు నుంచి చిరంజీవి పోటీ చేయగా… తిరుపతిలో గెలిచి.. పాలకొల్లులో ఓడిపోయారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల నుంచి బరిలోకి దిగే యోచనలో ఉన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/