టిడిపి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

pawan kalyan
pawan kalyan

అమలాపురం :అమలాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపు తనకు ప్రెస్టేజీ ఇష్యూ అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు .టిడిపి అభ్యర్థి తోట త్రిమూర్తులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన ఒకటేనంటూ తోట త్రిమూర్తులు ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఆయనతో తాను ఆ మాట ఎప్పుడు చెప్పానో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రమణబాబు కూడా తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తోట త్రిమూర్తులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రామచంద్రాపురంలో వీధి వీధికి తిరగాలన్నంత కోపం వచ్చిందని, తన ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే రామచంద్రాపురం వెళ్లలేకపోయానని పవన్ చెప్పారు. రామచంద్రాపురంలో ఒక్కో జనసేన కార్యకర్త.. ఒక్కో పవన్ కల్యాణ్ కావాలని, అక్కడ జనసేన అభ్యర్థిని గెలిపించి తన ప్రతిష్టను పెంచాలని పవన్ సూచించారు.

మరిన్నీ తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/