రేపు అమరావతికి జనసేనాని

pawan kalyan
pawan kalyan

విజయవాడ: జనసేన అధినేత pawan రేపు అమరావతికి రానున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు పవన్‌ చేరుకోనున్నారు. ఆ తర్వాత పటమటలంకలోని తన నివాసానికి జనసేనాని వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి జనసేన కార్యాలయంలో పశ్చిమగోదావరి, కృష్టా జిల్లాల నేతలతో పవన్‌ సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ రావాలని పవన్‌ పిలుపునిచ్చారు. సమీక్షలు ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికల గురించి నేతలతో పవన్‌ చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం పవన్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తారని తెలుస్తుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/