రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్‌ కల్యాణ్‌

రేపు ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయం సందర్శన

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనేపథ్యంలో పవన్‌ రేపు ఉదయం కేంద్రయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన కోటి రూపాయల చెక్కును అందజేస్తారు. ఇటీవల ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే’ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందజేయనున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా ఇటీవల తెలిపారు. ఈ మేరకు ఆ చెక్‌ను ఇవ్వనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మేఘాలయ శాసనసభ స్పీకర్ మెత్బా లింగ్డో, కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా కూడా పాల్గొంటారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/