అమెరికా తానా సభల్లో పవన్‌ కల్యాణ్‌

సీట్లు రావని తెలుసు
విలువలతో కూడిన రాజకీయాలే చేశాను
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి

Pawan Kalyan
Pawan Kalyan

అమెరికా: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీట్లు రావని, ఓడిపోతామని ముందే తెలుసుసని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఓటమి నుండి ఓ పాఠం నేర్చుకుంటున్నానని ఆయన అన్నారు. జనసేన పార్టీని కేత్రస్థాయిలో బలోపేతం చేయనున్నానని పవన్‌ అన్నారు. మనుషులను కలిపేలా జనసేన రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన, డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు తెలుసునని, అయితే, మారే ప్రజల కోసం తాను నమ్మిన మార్గంలోనే నడుస్తానని అన్నారు. అయితే జైలుకువెళ్లి వచ్చిన వ్యక్తులే బయట తిరుగుతున్నారని, అటువంటిది తాను రాజకీయాల్లో కొనసాగితే తప్పేంటని ప్రశ్నించారు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా ప్రజలు విడిపోరాదని పిలుపునిచ్చారు. తాను తానా సభలకు వెళ్లాలా? వద్దా? అని మదనపడ్డానని, కొందరు వెళ్లాలని, కొందరు వద్దాలని అన్నారని చివరకు వెళ్లాలనే నిర్ణయించుకున్నానని అన్నారు. జనసేన పార్టీకి ఎన్నో సమస్యలు ఉన్నాయని, తమలో తప్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎన్నారైలకు పవన్ కల్యాణ్ సూచించారు. పవన్ కల్యాణ్ తో పాటు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సైతం తానా సభల్లో పాల్గొన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/