అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు… ఎమ్మెల్యెకు పవన్‌ ఆదేశం

Pawan kalyan
Pawan kalyan

అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిని తరలించేందుకు వీలుగా ప్రభుత్వం బిల్లులు ప్రవేశ పెడితే మద్దతిస్తానని జనసేన ఎమ్మెల్యె రాపాక వరప్రసాద్‌ చెప్పిన విషయం తెలిసిందే. అయితే అతని వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై చర్చించిన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లుల్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెబుతూ రాపాకకు ఓ లేఖను పంపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే… ఏపి డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవల‌ప్‌మెంట్ రిజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని వ్యతిరేకించాలని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై… పార్టీ నిర్ణయానుసారం నడుచుకోవాలని లేఖలో రాపాకను కోరారు. ఒకవేళ రాపాక జనసేన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/