ఏ ధర్మానికైనా నష్టం జరిగితే ప్రశ్నిస్తాను

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan
Pawan Kalyan

తిరుపతి: జనసేన అధినేత నేడు తిరుపతిలో మీడియా సమావేశంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ఏ మతానికి అన్యాయం జరిగానా తాను ప్రశ్నిస్తానని, అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకుండా ఎలా ఉంటానని ఆయన అన్నారు. దీని కారణంగా ఓట్లు వస్తాయో? రావో తనకు తెలియదన్నారు. తన పోరాటం ఎప్పుడూ రాజ్యాంగ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే చర్చిల వద్దకు వెళ్లి ఎవ్వరూ జై శ్రీరామ్‌ అనరు, కడప దర్గాకు పోయి ఏ హిందువు జై భవాని అనరు. ఇలాంటి వాటిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం, అన్యమత ప్రచారం వద్దు, ఎందుకిలా చేస్తున్నారు? అంటూ పవన్‌ వ్యాఖ్యానించారు. విజయవాడ కనక దుర్గ ఆలయం పుష్కర ఘాట్‌లో సామూహిక మత మార్పిడులు జరుగుతుంటే వైఎస్‌ఆర్‌సిపి నేతలకు ఎందుకు అవి కనపడవు. మీరంతా హిందువులు కాదా అని ఆయన ప్రశ్నించారు. తాము హిందువులము అని చెప్పుకు తిరిగే నేతలు హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే ఎందుకు మాట్లాడట్లేదని పవన్‌ నిలదీశారు. తాను ధర్మం, సత్యాల గురించి మాట్లాడడానికి భయపడే వ్యక్తిని కాదని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/