అన్ని భవనాలను కూల్చితేనే ప్రజలకు నమ్మకం

pawan kalyan
pawan kalyan


అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. అనుమతిలేని భవనాలన్నింటిని కూల్చివేయాలని, అన్ని భవనాలను కూల్చితేనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. టిడిపి ప్రభుత్వం దాదాపు రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రజావేదికకు అనుమతుల్లేవని అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.
గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/