ఓటేసిన పవన్‌ కల్యాణ్‌

Pawankalyan
Pawankalyan

విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడలోని పటమటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఎలాంటి అటంకాం లేకుండా సజావుగా జరగాలని ఆకాంక్షించారు. అనంతపురంలో ఆ పార్టీ అభ్యర్థి మధుసూదన్‌ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేయడంపైనా ఆయన స్పందించారు. ఈ చర్య తప్పిదమేనని.. అయితే, వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకొవాలని, పూర్తి వివరాలు తెలియకుండా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/