విజయవాడ చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan
Pawan Kalyan

విజయవాడ: ఈరోజు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్‌ విజయవాడలోని తన నివాసానికి వెళ్లారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై పవన్ సమీక్ష జరపనున్నారు. తొలుత ముఖ్య నేతలతో.. తర్వాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 13 జిల్లాల్లోని నేతలతో ఆయన సమీక్ష జరపనున్నారు.ఇక నుంచి పవన్ కల్యాణ్ ప్రజా క్షేత్రంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ప్రజల్లో ఆదరణ సంపాదించాలని భావిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/