ఆ పుస్తకంలో జగన్‌ రెడ్డి ప్రస్తావన: పవన్‌ ట్వీట్‌

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ పాలన, నిర్ణయాన్ని విమర్శిస్తూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రోజుకో ట్వీట్‌ దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా రాయలసీమ వెనుకబాటుకు కారణాలు చూపుతూ 1996లో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ప్రచురించిన ‘కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం అనే పుస్తకాన్ని పవన్‌ ట్వీట్‌ చేశారు. ఈ పుస్తకంలో అనేక చేదు అనుభవాలు ఉన్నాయని, రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వల్ల నలిగి ఎలా వలసలు వెళ్లిపోతున్నారు, రాయసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌంతుంది అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ఈ పుస్తకంలో 75వ పేజీలో జగన్‌ రెడ్డి గారి ప్రస్తావన ఉందని కూడా పవన్‌ ట్వీట్‌ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business