శ్రీశైలం పాతాళగంగా స్నాన ఘట్టం మూసివేత

కరోనా నివారణ చర్యలలో భాగం

patala ganga
patala ganga

శ్రీశైలం: కరోనా విస్తరిణి అరికట్టేందుకు ప్రభుత్వంతో పాటు ప్రముఖ దేవాలయాలు కూడా నివారణ చర్యలను ముమ్మరం చేశాయి. అందులో భాగంగా ప్రముఖ ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీశైలంలో పాతాళగంగా స్నానఘట్టాన్ని అధికారులు మూసివేశారు. అధిక జన సంచారం ఉండే ప్రాంతాలలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ చర్యలలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అన్నదాన సత్రంలోనూ నేరుగా వడ్డించకుండా, ఆహరాన్ని భక్తులకు ప్యాకెట్ల రూపంలో ఇవ్వనున్నట్లు కార్యనిర్వాహక అధికారి కె.ఎస్‌.రామారావు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న భక్తులు, విదేశీ భక్తులు స్వామి దర్శనానికి రావొద్దని, దీనికీ భక్తులు సహకరించాలని సూచించారు. కాగా కరోనా నివారణ చర్యలలో భాగంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిని కూడా మూసివేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/