రాజీనామా చేయనున్న చంద్రబాబు..!

ap cm chandrababu
ap cm chandrababu

అమరావతి: ఏపి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకుల అంచనాలను మించి అటు అసెంబ్లీతో పాటు లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుంది. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సిపి 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు టిడిపి 24 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన సింగిల్ సీటులోనే ఆధిక్యంలో ఉంది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సిపి ఆధిక్యంలో ఉంది.

అయితే ఇంతటి ఘోర పరాజయం కావడంతో టిడిపి పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్‌కు ఫ్యాక్స్ ద్వారా రాజ్‌భవన్‌కు పంపించనున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/