ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్

OperationMuskan
OperationMuskan

Amaravati: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ 1,371 మంది పిల్లలను రక్షించింది. మొత్తం 693 టీమ్స్ పాల్గొన్న ఈ ఆపరేషన్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మాల్స్, థియేటర్స్, హోటళ్లలో తనిఖీలు నిర్వహించి మొత్తం 1,371 మంది బాలకార్మికులు, వీధి బాలలను గుర్తించారు. వీరిలో 286 మంది పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలను పనికి పంపితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ తల్లిదండ్రులను హెచ్చరించి పంపించగా మిగిలిన చిన్నారులను చైల్డ్ కేర్ హోమ్ లకు తరలించారు.