‘మళ్లీ నువ్వే రావాలి’

ap cm chandrababu
ap cm chandrababu


అమరావతి: టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు తొలి ప్రచార పాటను విడుదల చేశారు. ‘మళ్లీ నవ్వే రావాలి’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా అని ఆయన తెలిపారు. అయితే ఈ పాటను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను నేతృత్వలో రూపొందించారు. కాగా ‘చంద్రుడా రారా.. ఇంద్రుడై రారా.. నీ పరిపాలన మాకు వరం..’ అంటూ ప్రారంభమైన ఈ పాటలో ఏపి రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి, ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణాలను వివరించారు. రేపటి నుండి టిడిపి రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/