విశాఖలో మళ్లీ పెద్ద ఎత్తున గ్యాస్‌ లీక్‌!

ప్రాణభయంతో రోడ్లపైకి వందలాదిమంది

Vizag gas leak

విశాఖ: విశాఖపట్టణంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గత అర్థరాత్రి మళ్లీ భారీ స్థాయిలో విషయవాయువు లీక్‌ కావడంతో జనం భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు… వేలాదిమంది ప్రాణాలు అరచేత పట్టుకుని అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరోవైపు, పూణెకు చెందిన ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన 9 మంది శాస్త్రవేత్తలు గ్యాస్ లీక్ అయిన ఎల్‌జీ పాలిమర్స్‌లోకి వెళ్లి పరిశోధన ప్రారంభించారు. న్యూట్రలైజర్‌ను ఉపయోగించి విషవాయువు బయటకు రాకుండా గడ్డకట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం సురక్షితంగా ఉందని, నేడు శాస్త్రవేత్తలు ప్రకటన చేయనున్నారని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. కాగా 22 గంటల్లోనే మరోసారి గ్యాస్ లీక్ అవడంతో ఈ ప్రాంత ప్రజలను ఖాళీ చేయించారు. కెమికల్ ప్లాంటు చుట్టుపక్కల రెండుకిలోమీటర్ల పరిధిలోని ఇళ్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ ఇంకా వెలువడుతున్నందున 5కిలోమీటర్ల పరిధిలోని ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, వారిని బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని విశాఖపట్టణం అగ్నిమాపకశాఖ అధికారి సురేంద్ర ఆనంద్ చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/