టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

chandrababu
chandrababu

గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరులోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలంలో టిడిపి జెండా ఎగురవేసిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతు తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని చంద్రబాబు అన్నారు. ఇక నుండి ప్రతిరోజు గుంటూరు కార్యాలయానికి వస్తానని చెప్పారు. రోజూ 3గంటల పాటు నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. చంద్రబాబు దంపతులతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, గల్లా జయదేవ్‌, కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/