జగన్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

N ramanaidu
N ramanaidu

అమరావతి: ఏపి సియం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి టిడిపి సభా హక్కు ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. వడ్డీలేని రుణాల విషయంలో సభను సియం తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. గురువారం అసెంబ్లీలో కరవుపై జరిగిన చర్చ సందర్భంగా సభను సియం తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
ఇవాళ శాసనసభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో రామానాయుడు మాట్లాడుతూ..సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల నాయకుడిని హేళన చేస్తూ మాట్లాడారు. సభ నుంచి రాజీనామా చేస్తారా అని సవాల్‌ చేశారు. వడ్డీలేని రుణాలు ఎంత మొత్తం ఇచ్చామన్నది రికార్డులతో సహా చూపిస్తున్నా, సభలో అసత్యాలు మాట్లాడి తప్పుదోవ పట్టించడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/