జగన్‌ కేబినెట్‌లో చోటు దక్కని రోజా!

Roja
Roja

అమరావతి: ఏపి మంత్రివర్గ విస్తరణ ఏర్పడింది. మొత్తం 25 మందికి జగన్‌ తన జట్టులో చోటు కల్పించారు. అందులో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులను కట్టబెట్టారు. వీరంతా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ జట్టులో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజాకు కేబినెట్‌లో పెద్ద పోస్టే దక్కుతుందని మొదటి నుంచి ఊహాగానాలు వినిపించాయి. చివరికి ఆ జాబితాలో పేరు లేకపోవడం గమనార్హం. మంత్రివర్గంలో మహిళలకు చోటు అనే పేరు వినిపించగానే ప్రముఖంగా రోజా పేరే పార్టీ తరఫున బలంగా వాణి వినిపించే మహిళా నేతగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది. అయినా మంత్రివర్గంలో చోటు దక్కలేదు.మంత్రి పదవి బదులు ఇంకేదైనా పదవి ఇస్తారో చూడాలి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/