క్రూరమృగాల ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుంది

నిర్భయ దోషుల ఉరి ..ఇలాంటి ఉన్మాదులకు కనువిప్పు కావాలి

mla roja
mla roja

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె రోజా నిర్భయ దోషుల ఉరి అమలు పై ఫేస్‌బుక్‌లో స్పందించారు. నిర్భయకు న్యాయం జరిగిందని అన్నారు. క్రూరమృగాల ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుందని చెప్పారు. ఏడున్నరేళ్లుగా తన కూతురుని హతమార్చిన నిందితులకు శిక్షపడేందుకు పోరాడిన నిర్భయ తల్లికి వందనం చేస్తున్నానని అన్నారు. నలుగురు దోషుల ఉరి.. ఇలాంటి ఉన్మాదులకు కనువిప్పు కావాలని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/