కోనసీమలో కరోనా తరహా వైరస్‌

పిట్టల్లా రాలుతున్న జంతువులు, పక్షులు

Animals dead in konaseema
Animals dead in konaseema

రాజమండ్రి: కోనసీమలో కరోనాను తలపిస్తున్న మరో వైరస్ వ్యాధి ప్రబలిందన్న వార్తలతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హెర్సీస్ వైరస్ వల్ల లంపి స్కిన్ అనే వ్యాధితో జంతువులు, పక్షులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయని చెబుతున్నారు. కోనసీమలో విజృంభిస్తున్న ఈ వైరస్ స్థానిక ప్రజలను వణికిస్తోంది. పశువులకు, కోళ్లకు శరీరంపై భయంకర కంతులు, రంధ్రాలు వచ్చి తీవ్ర రక్త స్రావంతో విలవిల్లాడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఉత్తరాది జిల్లాల నుంచి కోనసీమకు ఈ వైరస్ పాకిందని పలువురు చెబుతున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున భయాందోళన పెల్లుబుకడంతో అప్రమత్తమైన పశు సంవర్ధక శాఖ చర్యలకు ఉపక్రమించింది. కానీ ఈ వైరస్‌కు ఎలాంటి వైద్యం లేదని పశు వైద్య ఆధికారులు అంటున్నారు. దాంతో ప్రజల్లో భయాందోళన మరింత పెరిగిపోతోంది. పశువుల మరణంతో పెద్ద ఎత్తున నష్టపోతున్నామని వాపోతున్నారు స్థానికులు. ఈ వైరస్‌ను వైద్య వర్గాలు హెర్సీస్‌ అని చెబుతున్నాయి. ఈ హెర్సిస్ వైరస్ వల్ల స్కిన్ వ్యాధి బారిన పడుతున్న మూగ జీవాలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/