సిఎం జగన్‌ ఇంటి పనుల నిధులు రద్దు

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ నివాసం, క్యాంపు కార్యాలయంకు సంబంధించిన వివిధ పనులకు కేటాయించిన నిధులను ప్రభుత్వం నిలిపివేసింది. తాడేపల్లితో పాటు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ నివాసానికి సెక్యూరిటీ కోసం కేటాయించిన నిధుల జీవోలను ఏపి ప్రభుత్వం రద్దు చేసింది. తాడేపల్లి నివాసానికి ఫర్నిచర్‌ కొనుగోలు, విద్యుత్‌ సౌకర్యం, ఇతర వసతులకు సంబంధించిన నిధులు సహా సుమారు రూ. 3 కోట్ల విలువైన పనులకు కేటాయించిన నిధులను నిలుపు దల చేస్తున్నట్లు జీవోలు జారీ చేసింది. కాగా సిఎం జగన్‌ ఆదేశాల మేరకు రద్దుకు సంబంధించిన 6 జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/