వివేకా ప్రధాన అనుచరుడికి నార్కో పరీక్ష!

YS Vivekananda
YS Vivekananda

కడప: దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే వాచ్‌మెన్‌ రంగన్న, కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డికి నార్కో పరీక్షలు చేయడానికి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు చేయాలని సిట్‌ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోరుతూ పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే వివేకా హత్యలో సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో అరెస్టయిన గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు. గంగిరెడ్డికి నార్కో అనాలసిస్‌ పరీక్షలపై పులివెందుల కోర్టు ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు 20 మంది సాక్షులను పోలీసులు విచారించారు. ఇంకా మరికొందరిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/