తిరుగుబాటు మొదలైంది..ఇక సమరమే

nara lokesh
nara lokesh

అమరావతి: మూడు రాజధానుల బిల్లును అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ముందుకు వెళుతున్న నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. తమ పోరాటాన్ని ఆపేది లేదంటూ ప్రకటిస్తున్నారు. మరోపక్క టిడిపి నేతలు, జేఏసీ నేతృత్వంలోని పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. శాసన సభలో సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు అమోదింప చేసుకున్న ప్రభుత్వం శాసన మండలిలో వీటి ఆమోదానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో నిరసించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తిరుగుబాటు మొదలైంది.. ఇక సమరమే అంటూ ఓ వ్యాఖ్యను పోస్ట్ చేశారు. అంతకుముందు శాంతి యుతంగా నిరసనలు తెలుపుతున్న తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తారా అని సీఎం జగన్ ను ట్విట్టర్ మాధ్యమంగా ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/