జనసేనలోకి నాగబాబు..నరసాపురం నుంచి పోటీ

pawan kalyan, naga babu
pawan kalyan, naga babu


అమరావతి: సినీ నటుడు నాగబాబు జనసేనలో చేరారు. తమ్ముడు పవన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతేడాది నాగబాబు జనసేనకు 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు ప్రత్యక్షమయ్యారు. దీంతో అప్పటి నుంచి జనసేనలో ఆయన చేరుతారనే ప్రచారం జరుగుతుంది.
నాగబాబు రంగ ప్రవేశంతో నరసాపురం ఎంపి స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే టిడిపి నరసాపురం ఎంపి అభ్యర్థిగా శివ రామరాజును ఆ పార్టీ ప్రకటించింది. వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఎంపి అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్టంరాజును బరిలోకి దింపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/