నాడు-నేడు పై అధికారులతో సిఎం సమీక్ష

jaganmohan reddy
jaganmohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ గురువారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల సమీకరణపై ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా లక్ష్యాలు, అంతే వేగంతో పనులు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని జగన్‌ అన్నారు. విద్యారంగంలో నాడు-నేడు పనులపై తాము కన్న కల నిజం కావాలని అధికారులకు ముఖ్యమంతి సూచించారు. ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో కూడా నాడునేడు, కొత్తగా నిర్మించే నిర్మాణాలు అత్యంత ముఖ్యమైనదన్నారు. అక్టోబర్‌ 1 నుంచి రాయలసీమ కరువు నివారణా పనులు ప్రారంభించాలని సిఎం అధికారులను ఆదేశించారు. స్టేట్‌ వాటర్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌లో భాగం పోలవరం నుంచి అదనపు జలాల తరలింపు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ పనులు, తాగునీటి వసతి కల్పన, కృష్ణాజకొల్లేరు ప్రాంతం ఉప్పు నీటిమయం కాకుండా చేపట్టాల్సిన నివారణ పనులు త్వరగా ముందుకు సాగాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. ఏడాదిన్నరలోగా విద్యారంగంలో నాడు-నేడుపనులు పూర్తి కావాలని సిఎం అధికారులను ఆదేశించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/