విశాఖలో 2 కోట్ల మొక్కలను నాటాలి

25 కోట్ల మొక్కలను పెంచాలని సిఎం నిర్ణయించారు..

MP Vijayasai Reddy Said CM YS Jagan Has Decided To Plant 25 Crore

విశాఖ: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజసాయరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ సాగర తీరంలో సన్‌రే ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని సిఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. నౌపాక మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయన్నారు. నౌపాక మొక్కలను బీచ్‌లో నాటడం ఆనందంగా ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలో ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా మొక్కలు దోహద పడతాయన్నారు. విశాఖలో 2 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ బీచ్‌లో మొక్కలు నాటాలని సన్‌రే రాజుబాబు సంక్పలించారన్నారు. రాబోయే రోజుల్లో ఈ మొక్కలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇస్తాయన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/