మాంటిస్సోరి వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ కన్నుమూత

Montessori Founder Koteswaramma  Deied
Koteswaramma (file)

Vijayawada:
మాంటిస్సోరి విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ 1955లో మాంటిస్సోరి పాఠశాల స్థాపించగా మాంటిస్సోరి పాఠశాలలు, ఇంటర్ డిగ్రీ కళాశాలల ద్వారా లక్షలాది మందికి విద్యాదానం, స్త్రీ విద్య, సమాజ నిర్మాణం, మహిళా సాధికారత కోసం కృషి చేశారు. కేవలం విద్యార్ధినుల కోసమే ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేశారు. 1925లో జన్మించిన కోటేశ్వరమ్మ 92 ఏళ్ల వయసులో పద్మ పురస్కారం అందుకోగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు పలు అవార్డులు సాధించారు. మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి, మాజీ ఎంపీ మాగంటిబాబు, ఐ.ఎ.యస్ అధికారి ఉషాకుమారి, డాక్టర్ రమేష్ తదితరులంతా కోటేశ్వరమ్మ విద్యాసంస్థల నుండి వచ్చిన వారే.