పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం వైఎస్‌ఆర్‌

వైఎస్‌ఆర్‌ స్నేహశీలి అంటూ మోహన్ బాబు ట్వీట్

Mohan Babu
Mohan Babu

హైదరాబాద్‌: నేడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 71వ జయంతి. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. వైఎస్‌ఆర్‌ స్నేహశీలి అని కొనియాడారు. మాట తప్పలేరు మానధనులు అన్న పోతన మాటకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనం అని అభివర్ణించారు.’పేద ప్రజల దైవం మా బావగారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ మోహన్ బాబు స్పందించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/