సిఎం జగన్‌కు ప్రధాని మోడి శుభాకాంక్షలు

Jagan, Narendra Modi
Jagan, Narendra Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ప్రభుత్వానికి కేంద్రం నుండి పూర్తి సహాయ, సహకారాలు అందేలా చూస్తానని తాను భరోసా ఇస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా మోడి తెలిపారు. ఏపిని అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు కలసి పనిచేద్దామని మోడి చెప్పారు.
ఈరోజు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో జగన్‌ ఏపి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/