భవిష్యత్ లో ఏపీ, తమిళనాడులో అధికారంలోకి వస్తాం :

Modi  at Tirupati Meeting
Modi

Tirupati: ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి కార్బన్ సెల్ ఫోన్ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో పాల్గొన్నారు. మోడీ ఈ సమావేశంలో కార్యకర్తలను, నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు తిరుపతి కార్బన్ సెల్ ఫోన్ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మరోసారి అధికారమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలని, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక తిరుపతి రావడం ఆనందంగా ఉందని, శ్రీలంక బిజీ షెడ్యూల్ వలన ఇక్కడకి రావడం ఆలస్యమైందని, వేచి ఉన్న ప్రజలకు, నేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

 వేంకటేశ్వరస్వామి స్తోత్రంతో మోడీ ప్రసంగం ప్రారంభం

తిరుపతి కార్బన్ సెల్ ఫోన్ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో ప్రధాని నరేంద్ర మోడీ వేంకటేశ్వరస్వామి స్తోత్రంతో తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి వచ్చామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఏపీ, తమిళనాడు బీజేపీ కార్యకర్తలు అలుపెరగని పోరాటం చేశారని, దేశప్రజలతో మమేకమవడమే మన నిత్యకృతమని, ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు 365 పనిచేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి చేయూతనిస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.  తిరుపతి కార్బన్ సెల్ ఫోన్ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వెంకన్న ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు 365 రోజులు పనిచేస్తామన్నారు.

సుపరిపాలన అందించాలని జగన్ ను కోరుతున్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని జగన్ ను కోరుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తిరుపతి కార్బన్ సెల్ ఫోన్ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రంగాల్లో ముందుందన్నారు. ఏపీ ప్రజల్లో ప్రతిభా పాటవాలకు కొదవ లేదన్నారు. మా ప్రభుత్వంపై దేశ ప్రజల ఆకాంక్షలు పెరిగాయన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని దేశప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. అవినీతి రహిత పాలన అందించామనే ప్రజలు మళ్లీ ఆదరించారని మోడీ అన్నారు.

భవిష్యత్ లో ఏపీ, తమిళనాడులో అధికారంలోకి వస్తాం :

భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తిరుపతి కార్బన్ సెల్ ఫోన్ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికలలో గెలవలేని స్థతి నుండి ఈ స్థాయికి ఎదిగామన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు మరోసారి అవకాశం వచ్చిందన్నారు.