డీజీపీపై ఎమ్మెల్యె ఫిర్యాదు

ramakrishna reddy with dgp thakur
ramakrishna reddy with dgp thakur

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె ఆళ్ల రామకృష్ణారెడ్డి డీజీపీ ఠాకూర్‌ పై ఫిర్యాదు చేశారు. అయితే ఠాకూర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారనిఎన్నికలు పూర్తయ్యే వరకు ఠాకూర్‌ను డీజీపీ పదవి నుంచి తప్పించాలని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఆర్కే ఫిర్యాదు చేశారు. తరువాత ఆయన మాట్లాడుతూ.. ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన డీజీపీగా ఉంటే ప్రజలు ఓటు హక్కును సజావుగా వినియోగించుకోలేరని తెలిపారు. ఠాకూర్‌పై హైకోర్టులో వేసిన పిల్ పెండింగ్‌లో ఉండగా ఆయనను డీజీపీగా నియమించారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పార్కు స్థలాన్ని డీజీపీ ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించారని విమర్శించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/