రేపు ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభం

minister-venugopal-krishna

అమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు రేపు(బుధవారం) ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభించనున్నట్లు  తెలిపారు.  ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నేరుగా ఏడాదికి 18,750 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. అంటే నాలుగేళ్ళలో 75 వేల రూపాయలు వారికి ఆర్థిక సహయం అందనుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మహిళలకు ఈ ఏడాది 4 7 00 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా..  సీఎం జగన్‌ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/