ఆపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా?

ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారని పెద్దల సభ పెట్టారు

kodali nani
kodali nani

అమరావతి: ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారని పెద్దల సభ (శాసన మండలి) పెట్టారని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఇప్పుడు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపారని విమర్శించారు. బుధవారం మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభలో కొడాలి నాని మాట్లాడారు. కాగా గతంలో మండలిలో ఇలాంటి పరిస్థితే వస్తే అప్పటి సీఎం ఎన్టీరామరావు మండలిని రద్దు చేశారని గుర్తు చేశారు. మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందితే ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ది చెంది ముఖ్యమంత్రి జగన్‌కు మంచి పేరు వస్తుందనే భయంతోనే చంద్రబాబు ఇలా చేశారని ఆయన దుయ్యబట్టారు. మండలి చైర్మన్‌ విచక్షణాధాకారాలతో అలా చేశారని టిడిపి సభ్యులు చెబుతున్నారు. సీఎంకు విచక్షణాధికారాలు లేవా? అని ఆయన ప్రశ్నించారు. తీర్మానం పెట్టి కార్యాలయాలను విశాఖ తరలించాలనుకుంటే ఆపగలిగే శక్తిసామర్థ్యాలు ఎవరికైనా ఉంటే ఆపండని టిడిపి సభ్యులకు కొడాలి నాని సవాల్‌ విసిరారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/