చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన బొత్స

Botsa Satyanarayana
Botsa Satyanarayana

విజయనగరం: టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ సిఎం చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారయణ మరోసారి విమర్శలు చేశారు. రాజధానిలో ఏమి చూడటానికి వస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన నష్టం 20 ఏళ్లలో కూడా పూడ్చలేమన్నారు. రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి విమర్శించారు. రాజధానిలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. యనమల రామకృష్ణుడులా తాను దోచుకోలేదని అందుకు నన్ను బర్తరఫ్‌ చేయాలా అని ప్రశ్నించారు. కొన్ని పత్రికలు తమపై విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాజధానిలో ఏం సంపద సృష్టించారని ప్రశ్నించారు. సింగపూర్‌ కన్సార్టియంతో ఒప్పందం లోపభూయిష్టమని, పరస్పర అంగీకారంతోనే సింగపూర్‌ కన్సార్టియం తప్పుకుందని బొత్స వివరించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/