రాజధాని అమరావతిని మార్చడం లేదు

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మార్పుపై అనేక పుకార్లు షికార్లు చేశాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉహాగానాలకు చెక్‌ పెట్టింది. ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కీలక ప్రకటన చేసింది. రాజధానిని మార్చే ఉద్దేశం లేదని పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారయణ తెలిపారు. ఈ మేరకు శాసన మండలిలో టిడిపి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కాగా గతంలో మంత్రులు బొత్స,బుగ్గన తదితరులు చేసిన వ్యాఖ్యలు రాజధాని రైతుల్లో ఒకింత గందరగోళానికి తెరతీశాయి. కానీ ఇపుడు మంత్రి బొత్స లిఖిత పూర్వకంగా సమధానం ఇవ్వడంతో రాజధానిగా అమరాతి కొనసాగుతుంని తెలిపోయింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/