టిడిపి సభ్యులపై మండిపడ్డ మంత్రి అనిల్‌

Anil Kumar
Anil Kumar

అమరావతి: ఏపి శాసన సభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ప్రారంభం కాగానే టిడిపి సభ్యులు ఆందోళన చేపట్టారు. జై అమరావతి అంటూ పెద్దగా నినాదాలు చేశారు. దీంతో టిడిపి సభ్యులపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానా ఎన్నికలకు ముందే దివాళా తీయడానికి కారణం టిడిపి అని ఆయన ఆరోపించారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్ఠు పట్టించారని మండిపడ్డారు. సభలో ఇంకా ఎందుకు రభస చేస్తున్నారని టిడిపి నాయకులను ఆయన నిలదీశారు. ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే 23 స్థానాలు ఇచ్చారని అనిల్‌ విమర్శించారు. బిసిలు, ఎస్‌సిల గురించి టిడిపి నేతలు మాట్లాడడం విడ్డూరం అని ఎద్దేవా చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/