సమస్యలపై నా ఫోన్ నెంబర్ కు కాల్ చేయొచ్చు

ఏలూరు కలెక్టరేట్ నుంచి మంత్రి సమీక్ష

minister-alla-nani

అమరావతి: ఏపి మంత్రి ఆళ్ల నాని ఏలూరు కలెక్టర్‌ ఆఫీసు నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై మాట్లాడారు. ఏలూరు ఆశ్రమ్, భీమవరం, తాడేపల్లిగూడెం కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే, ఈ సమీక్షలో మంత్రికి కరోనా రోగుల నుంచి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. చికిత్సా కేంద్రాల్లో పారిశుద్ధ్యలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, బాత్రూంలు సరిగా శుభ్రం చేయడంలేదని, దుప్పట్లు ఇవ్వడంలేదని, ముఖ్యంగా భోజనం నాసిరకంగా ఉందంటూ అత్యధికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆళ్ల నాని కరోనా చికిత్సా కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు వస్తే 1800 233 1077 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయొచ్చని, లేకపోతే తన ఫోన్ నెంబర్ కైనా కాల్ చేసి సమస్యలు నివేదించవచ్చని ఆళ్ల నాని స్పష్టం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/