2024 ఎన్నికలే టార్గెట్‌

MEKAPATI, Ex MP
MEKAPATI, Ex MP

Vijayawada: : వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కల నెరవేరిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై ఉన్న ప్రేమానురాగాలతోనే అత్యధిక మెజారిటీతో గెలపించారని చెప్పారు. వైయస్‌ జగన్‌ ఈ రోజు నుంచే 2024 ఎన్నికలు టార్గెట్‌ చేసి గొప్ప పరిపాలన  ఇస్తారని ఆయన విశ్వసించారు.