గోదావరి జలాల తరలింపుపై 11న భేటి

Srisailam dam
Srisailam dam

అమరావతి: గోదావరి నదిలోని మిగులు జలాలను కృష్ణా నదిలోకి మళ్లించి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలన్న తెలుగు రాష్ట్రాల బృహత్తర ప్రణాళికలో భాగంగా అనుసంధాన పథకంపై చర్చించేందుకు ఈనెల 11న జల వనరుల శాఖ నిపుణులు సమావేశమవుతున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల జవనరుల శాఖ అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌, అంతర్రాష్ట్ర జవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహారావు, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/