విశాఖలో పోలీస్ కారు చోరీ

police vehicles
police vehicles

విశాఖ: విశాఖలో పోలీస్ కారును ఓ వ్యక్తి చోరీ చేశాడు. ఆ కారును పట్టుకునేందుకు రోడ్డు మీద పోలీసులు ఛేజింగ్ చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద కొందరు ర్యాలీ చేపడుతున్నారు. అయితే, వారికి పోలీసులు సర్దిచెప్పేక్రమంలో ఉన్నతాధికారులు ఎలా వ్యవహరించాలో పోలీసులకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో పోలీస్ కారును ఓ పక్కన పెట్టి నిరసనకారులు ఉన్న వైపునకు వెళ్లారు. అయితే, కారు డ్రైవర్ తాళాన్ని అక్కడే వదిలి వెళ్లడంతో ఓ యువకుడు ఆ తాళం తీసుకుని కారు స్పీడ్‌గా వేసుకుని వెళ్లిపోయాడు. ఆ హఠాత్పరిణామానికి పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే మరో వాహనంలో ఆ పోలీస్ కారును ఛేజ్ చేశారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం ఈ ఛేజింగ్ సీన్ కొనసాగింది. అయితే, ఆ తర్వాత కారు చోరీ చేసిన వ్యక్తి దాన్ని ఓ కాలువలోకి తీసుకెళ్లి పడేశాడు. వెంటనే పోలీసులు అతడిని పట్టుకున్నారు. అయితే అతడికి మతి స్థిమితం సరిగా లేదని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఖఈ పిచ్చోడు కాసేపు చుక్కలు చూపించాడుగ అని పోలీసులు చర్చించుకున్నారు. కారు తాళాలు వాహనంలోనే వదిలి వెళ్లిన డ్రైవర్‌కు పోలీస్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/