బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్లాది విష్ణు

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఎంతో మేలు చేయాలని నాకు ఇ అవకాశం ఇచ్చారు

malladi vishnu
malladi vishnu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ గా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఎంతో మేలు చేయాలని తనకు ఈ అవకాశం ఇచ్చారని అన్నారు. ఉపనయనం చేసే కార్యక్రమాలు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారానే చేయాలనే ఆలోచన ఉందని, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతితో త్వరలో చేపడతామని అన్నారు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను సీఎం అమలు చేస్తున్నారని తెలిపారు. పేద బ్రాహ్మణలు, విద్యార్థులకు విజయవాడ, తిరుపతిలలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని మల్లాది విష్ణు పేర్కొన్నారు. బ్రాహ్మణులు అభివృద్దికి వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జ్వాలపురం శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజుల్లో బ్రాహ్మణులకు అవకాశాలు తగ్గుతున్నప్పటికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌ కొనియాడారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/