టీడీపీకి గుడ్‌ బై ?

ప్రకాశం : మాజీ ఎంపీ టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు తాను టీడీపీకి గుడ్‌ బై చెబుతున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ లో చేరుతున్నట్టు గానీ ఇంకా ప్రకటించలేదని అన్నారు. కార్యకర్తలు,అభిమానుల అభిప్రాయం మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.అప్పటి వరకు ఓపిక పట్టాలని తెలిప్పారు. టీడీపీకి రాజీనామా చేయనున్నారనే సమాచారంతో ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు ,ఓంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌. మాగుంటతో భేటీ అయ్యారు.చంద్రబాబును కలవాల్సిందిగా సూచించారు .చంద్రబాబును సాయంత్రం కలిసేందురు మాగుంట అంగీకరించారు.


https://www.vaartha.com/andhra-pradesh/
తాజా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః