చంద్రబాబు పై మాంగుట ప్రశంసలు


అమరావతి: ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు,తన అనుచరులతో సమావేశనంతరం వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.అయితే టీడీపీని వీడిన నేతలంతా ఆ పార్టీతో పాటు చంద్రబాబు పై విమర్శలు చేశారు కాని మాంగుట మత్రం చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. వైఎస్‌తో ఉన్న అనుబంధంతోనే వైఎస్‌ఆర్‌సీపీ లో చేరుతున్నానని ఆయన తెలిపారు.. తనకు చంద్రబాబుతో 37 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. తనకు ఆయన ఎంతో సహకరించారని.. తాను ఎంపీగా ఓడినా కూడా ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని మాగుంట కొనియాడారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి 
:https://www.vaartha.com/telengana/