వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై లోకేశ్‌ విమర్శలు

విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేని అసమర్థత

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్‌ ‘నాడునేడు’ అంటూ ఓ కార్టూన్‌ పోస్ట్ చేసి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో ఏపిలో రైతులు ఎలా ఉండేవారో, ఇప్పుడు సీఎం జగన్‌ పాలనలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అందులో వివరించారు.’రూ.12,500ల రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, ఉచితబోర్లు, ఉచిత విద్యుత్.. ఇలా అన్నీ కలిపి, ఏడాదికి రైతుకి లక్ష రూపాయలు లబ్ధి అన్నారు. లక్ష మాట దేవుడెరుగు.. కనీసం సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేని అసమర్థ వైకాపా ప్రభుత్వం 10 నెలల్లో 400మంది రైతుల్ని బలితీసుకుంది’ అని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/