ఏపిలో జెండాను ఎగురవేయనున్న మంత్రులు

National Flag of India
National Flag of India

అమరావతి: ఏపిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక వచ్చిన మొదటి స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో.. ఆ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏపి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎపి రాజధాని అమరావతిలో ఏపి సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ఆగస్టు 15 న జిల్లాల్లో జెండా వందనం చేసే మంత్రుల జాబితాను ఏపి ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. ఆ వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా సిఎం జగన్మోహన్‌ రెడ్డి, శ్రీకాకుళం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, విజయనగరం డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి, విశాఖపట్నం మంత్రి మోపిదేవి, తూర్పు గోదావరి డిప్యూటీ సిఎం ఆళ్ల నాని, పశ్చిమ గోదావరి డిప్యూటీ సిఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, గుంటూరు మంత్రి పేర్ని నాని, ప్రకాశం మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, నెల్లూరు మంత్రి సుచరిత, కర్నూల్‌ మంత్రి బత్స సత్యనారాయణ, కడప డిప్యూటీ సిఎం అంజాద్‌ బాషా, అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు డిప్యూటీ సిఎం నారాయణ స్వామి లు జెండాలు ఎగురవేయనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/